కొత్త అధ్యాపకులొచ్చారు.. | - | Sakshi
Sakshi News home page

కొత్త అధ్యాపకులొచ్చారు..

Published Tue, Mar 18 2025 12:26 AM | Last Updated on Tue, Mar 18 2025 12:24 AM

● జిల్లాలో 47 మంది నియామకం ● అతిథి అధ్యాపకులు ఇంటికి

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలోని 11 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలకు 47 మంది జూనియర్‌ లెక్చర ర్లు వచ్చారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో బోధన కష్టాలు తీరనున్నాయి. నూతన అధ్యాపకుల భర్తీతో ఇంటర్‌ విద్య మరింత బలోపేతం కానుంది. కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల ఖాళీల కొరతతో అతిథి ఒప్పంద అధ్యాపకులతో విద్యను అందించారు. ఎట్టకేలకు 13 సంవత్సరాల తర్వాత జిల్లాకు వచ్చిన 47 మంది కొత్త అధ్యాపకులు ఈనెల 13న విధుల్లో చేరారు.

కళాశాలల వారీగా కేటాయింపు ఇలా...

జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు 47 మంది జూనియర్‌ లెక్చరర్లు వి ధుల్లో చేరారు. బెజ్జూర్‌కు ఇంగ్లిష్‌, ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయ న శాస్త్రం అధ్యాపకులను కేటాయించారు. దహెగాంకు ఇంగ్లిష్‌, హిందీ, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జైనూర్‌కు ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, కెరమెరికి గణితం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, కౌటాలకు ఆర్థికశాస్త్రం, గణితం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రెబ్బెనకు హింది, వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, సిర్పూర్‌ (టీ)కి ఇంగ్లిష్‌, పౌరశాస్త్రం, జంతుశాస్త్రం, కాగజ్‌నగర్‌కు ఇంగ్లిష్‌, ఉర్దూ, ఆర్థికశాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, తిర్యాణికి కామర్స్‌, వృక్షశాస్త్రం, వాంకిడికి ఆర్థిక శాస్త్రం, హిందీ, గణితం, వృక్షశాస్త్రం, ఆసిఫాబాద్‌ కళాశాలకు ఉర్దూ, అర్ధశాస్త్రం, చరిత్ర, పౌర శాస్త్రం, హిందీ, ఆర్థికశాస్త్రం అధ్యాపకులను కేటాయించారు.

అతిథి అధ్యాపకుల పరిస్థితి ఏమిటి?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 46 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 186 మంది అతిథి అధ్యాపకులు పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకు ల పోస్టులను భర్తీ చేయడంతో అతిఽథి అధ్యాపకుల కొలువులకు ఎసరొచ్చింది. 2014 నుంచి అతిథి అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొత్త లెక్చరర్ల ని యామకంతో వారికి ఇబ్బందికరంగా మారింది. తమ సర్వీస్‌ ప్రాతిపదిక చేసుకుని ప్రభుత్వ కళాశాలల్లో అలాగే కొనసాగించాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్‌ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు పలు సందర్భాల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేస్తున్నా రు. నూతన నియామకంతో అతిఽథి అధ్యాపకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయంపైనే అతిథి అధ్యాపకుల కుటుంబాల పరిస్థితి ఆధారపడి ఉంది.

ఇంటర్‌ విద్య మరింత బలోపేతం..

అధ్యాపక పోస్టుల భర్తీతో జిల్లాకు 47 మంది కొత్త లెక్చరర్లు వచ్చారు. దీంతో జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నా ణ్యమైన విద్య అందనుంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులతో కూడిన విద్య అందిస్తాం.

– కళ్యాణి, డీఐఈవో

కొత్త అధ్యాపకులొచ్చారు..1
1/1

కొత్త అధ్యాపకులొచ్చారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement