కెరమెరి: మానవ హక్కుల జిల్లా కమిటీని సోమవారం మండల కేంద్రంలో ఎన్నుకున్న ట్లు ఎన్‌ఆర్‌హెచ్‌సీ చైర్మన్ రాథోడ్ రమేశ్ తెలి పారు. జిల్లా వైస్ చైర్మన్లుగా రాథోడ్ గోపాల్, పెందోర్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్‌గా జాదవ్ ఆకాశ్, జనరల్ సెక్రెటరీగా అలుగొట్టు నవీన్‌కుమార్, కెరమెరి మండల వైస్ చైర్మన్‌గా రాథోడ్ అర్జున్ ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి నియామకపత్రాలు అందజేశారు.
ఆర్టీసీ డీఎంగా రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కేవీ రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డిపోలో మెకానికల్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రమోషన్‌పై డీఎంగా బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ డీఎంగా పని చేసిన విశ్వనాథ్ బోధన్ డిపోకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది నూతన డీఎంను సన్మానించారు.
ఎన్‌ఆర్‌హెచ్‌సీ జిల్లా కమిటీ ఎన్నిక