ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణిలో భాగంగా వచ్చి న ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీ కరించారు. సంబంధి త ఎస్సై, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరి ష్కారానికి పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీ సు సేవలను వినియోగించుకోవాలని సూచించా రు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తోందన్నారు.
బాధితులకు అండగా భరోసా సెంటర్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని బాధిత మహిళలకు, చిన్నారులకు భరోసా సెంటర్ అండగా నిలుస్తోందని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావ్ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వచ్చిన విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్‌ని బాధిత మహిళలు ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా పోలీసు, వైద్య, న్యాయ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే 8712670561 లేదా డయల్ 100 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో భరోసా సెంటర్ ఇన్‌చార్జి ఎస్సై తిరుమల, తదితరులు పాల్గొన్నారు.