● అసెంబ్లీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్‌అర్బన్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభలో జీరో అవర్‌లో ఆసిఫాబాద్ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని, జాప్యంతో అంచనాలు పెరిగాయని తెలిపారు. రానున్న వర్షాకాలం ప్రారంభం నాటికి బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెరమెరి మండలం లక్మాపూర్ వంతెన పూర్తి చేయడంతో పాటు, ఆదిలాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని అన్నారు.