ఆసిఫాబాద్‌రూరల్: హైదరాబాద్‌లోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్కూల్ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 18 మంది బాలబాలికలను ఎంపిక చేసినట్లు డీటీడీవో రమాదేవి, డీఎస్‌వో మీనారెడ్డి తెలిపారు. విద్యార్థులు మంగళవారం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. మార్చి 19న హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి వాటర్ స్పోర్ట్ అకాడమీ స్కూల్‌లో అర్హత క్రీడాపోటీలు ఉంటాయని డీటీడీవో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పోటీలకు జిల్లా నుంచి 11 మంది బాలురు, ఏడుగురు బాలికలను పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, హెచ్‌ఎం జంగు, వార్డెన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.