● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌అర్బన్: లేఅవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్–2020 పథకంలో దరఖాస్తుదారుల నుంచి రుసుం వసూలుపై దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావు, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్‌కుమార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించా రు. రుసుం చెల్లింపు ప్రక్రియలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. 25 రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించా రు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణ, పీటీఎస్ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
‘బేటీ బచావో– బేటీ పడావో’ అమలుకు కార్యాచరణ రూపొందించాలి
వచ్చే ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025 –26 ఆర్థిక సంవత్సరంలో బేటీ పడావో– బేటీ బచావో కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతీ పంచాయతీలో బాలసభలు నిర్వహించాలని, వి ద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో బా లికల విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మానసిక నిపుణులతో భవిష్యత్తుపై కౌన్సెలింగ్, కెరీర్ గైడె న్స్ గురించి వివరించాలని, లైంగిక దాడులు జరుగకుండా ఆత్మ రక్షణ కోసం కరాటే శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భా స్కర్, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, సీడీపీవో రేణుక, జిల్లా మహిళా సాధికారత సమన్వయ కర్త శారద, సభ్యులు మమత, రాణి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.