ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 36 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు లాంగ్వేజ్ పరీక్షకు 6,560 మంది విద్యార్థులకు 6,531 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తెలిపారు. 99.5 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. జన్కాపూర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. విద్యార్థుల హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సోషల్ వెల్ఫేర్ స్కూల్‌ను ఎస్సీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. అలాగే జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ డేవిడ్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పర్యవేక్షించారు. వాంకిడి, కెరమెరి, ఈజ్‌గాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
ప్రయాణమే ‘పరీక్ష’
దహెగాం: సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. దహెగాం మండలంలోని ఇట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రా రంభమవుతుండగా ఆ సమయంలో కా గజ్‌నగర్, మంచిర్యాల రూట్‌లో బస్సు సర్వీసులు లేవు. దీంతో విద్యార్థులు శుక్రవారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే ట్ ఆటోలో ఇలా వేలాడుతూ కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు బస్సులు నడిపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు కౌన్సెలింగ్
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఎస్సై కమలాకర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై పదో తరగతి పరీక్షకు వెళ్లిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు వెళ్లేందుకు మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే పిల్లలతోపాటు ఇతరులకు నష్టం జరుగుతుందన్నారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారికి జరిమానా విధించారు.
తొలిరోజు 99.5 శాతం హాజరు
పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ, అధికారులు
‘పది’ పరీక్షలు షురూ
‘పది’ పరీక్షలు షురూ
‘పది’ పరీక్షలు షురూ