
తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఆదివారం తాగునీటి కోసం రోడ్డెక్కారు. పదిరోజులుగా మిషన్ భగీరథ, పంచాయతీ బోరు నుంచి తాగునీరందడం లేదని ఖాళీ బిందెలు, డబ్బాలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పది రోజులుగా స్నానం చేసేందుకు, తాగేందుకు గుక్కెడు నీరందడం లేదన్నారు. బోర్‌వెల్‌కు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆడే సురేశ్‌నాయక్, మహిళలు పాల్గొన్నారు.