
రుణాల రికవరీలో ఆదర్శం
● జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం ● మంత్రి సీతక్క చేతుల మీదుగా స్వీకరించిన అదనపు కలెక్టర్
ఆసిఫాబాద్: సీ్త్రనిధి(మెప్మా) రుణాల రికవరీ లో ఆదర్శంగా నిలిచిన జిల్లాకు అరుదైన గౌర వం దక్కింది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 94 శాతం రుణాల రికవరీతో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రత్యేక పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బుధవారం నిర్వహించిన సీ్త్రనిధి 12వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి రాష్ట్రస్థాయి పురస్కా రం అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, మహిళా సాధికారతపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. సీ్త్రనిధి ఆర్‌ఎం శ్రీనివాస్, మె ప్మా హెడ్ మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు.