కెరమెరి(ఆసిఫాబాద్): భూసమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమార్కులు విచ్చలవిడిగా పట్టాలు పొందుతున్నారని ఆరోపించారు. పార్డ గ్రామంలో ఓ గిరిజనేతరుడు అక్రమంగా బై నంబర్లతో పట్టాలు పొందాడని పేర్కొన్నారు. సుర్దాపూర్ గ్రామంలో కూడా జంగుబాయి దేవతల ప్రతిమలు ఉన్న భూములను కబ్జా చేసి పట్టాలు పొందారని ఆరోపించారు. ఎస్‌డీసీకి దరఖాస్తు చేసి తొమ్మిది నెలలవుతున్నా పరిష్కారం కాలేదన్నారు. అక్రమ పట్టాలను రద్దు చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డీటీ సంతోష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఆత్రం రాజు, సిడాం ధర్మూ, చహకటి రాంకిషన్, తలండి జంగు, బాలకిషన్, పెందోర్ వినేష్, వల్క బాదు తదితరులు పాల్గొన్నారు.