ఆసిఫాబాద్: నూతన చట్టాలపై పోలీసు అధికారులకు అవగాహన అవసరమని డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ యువరాజ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి నేరాలు, సైబర్ మోసాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సత్వర పరిహారం వచ్చేలా చూడాలన్నారు. లోక్‌అదాలత్ ద్వారా చాలావరకు కేసు పరిష్కారం కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు కేసులు, శిక్షలు, ఇతర విషయాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి యువరాజను ఎస్పీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు శాలువాతో సన్మానించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, రమేశ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.