● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్‌వర్క్(బీఎస్‌ఎన్‌ఎల్)టవర్ల నిర్మాణా లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ స బ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎఫ్‌డీ వో సుశాంత్, బీఎస్‌ఎన్‌ఎల్ నిజామాబాద్ సర్కిల్ జీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జీఎం జగ్రామ్‌తో కలి సి టవర్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన తొమ్మిది టవర్లలో ఎనిమిదింటికి ఎలాంటి ఆటంకా లు లేనందున అనుమతులు పొంది నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కెరమెరి మండలం పరందోళిలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు స యుక్తంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జి ల్లాలో అదనంగా మరో 16 టవర్లు మంజూరయ్యాయని, అనువైన స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు కిరణ్, దత్తు, ప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.