
ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపా రు. పట్టణాల్లో ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వేగ నియంత్రణలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంచిర్యాల నుంచి వచ్చే దారిలో ఆసిఫాబాద్ ముఖద్వారం వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో ని ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన తరగతులు, వ్యా సరచన పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్ర మాదాల నివారణలో భాగంగా డ్రంకెన్‌డ్రైవ్, విస్తృ తస్థాయిలో తనిఖీలు చేపట్టాలని, ద్విచక్రవాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించాలని, కారు ఇతర వాహనాల డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రహదారులపై ప్రమాదం జరిగిన వెంటనే క్షతగా త్రులను సమీప ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఎ క్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించాలని, జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్‌రోడ్డుతో పాటు డ్రైనేజీలు నిర్మించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధి కారి రాంచందర్, రోడ్డు, భవనాల శాఖ అధికారి సు రేందర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, డీఎంహెచ్‌వో సీతారాం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.