కృష్ణా: ఆఆధ్యాత్మిక క్షేత్రాలు.. సముద్రతీరంతో కృష్ణా తీరంలోని నాగాయలంక మండలం పర్యాటక శోభతో పరిఢవిల్లుతోంది. ప్రకృతి సౌందర్యాల మధ్య షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. మది ఆనందంతో పరుగులు తీస్తుంది. పర్యాటక సోయగాలు కొందరికి ఉల్లాసాన్ని కలిగిస్తే మరికొందరికి విజ్ఞానాన్ని అందిస్తాయి. బుధవారం పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
నాగాయల లంక మండలం వారాంతపు ఆహ్లాదానికి విలాసంగా విరాజిల్లుతోంది. ఇక్కడ దక్షిణ బంగాళాఖాతం, పశి్చమ కృష్ణా పరివాహక తీర ప్రాంతం పర్యాటకులకు నిత్యం ఆహా్వనం పలుకుతోంది. దివిసీమతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండుదీవులు(ఎదురుమొండి–ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈప్రాంత పర్యాటక ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. స్థానిక శ్రీరామపాదక్షేత్రం ఘాట్, కృష్ణానది, లైట్‌హౌస్‌లు పర్యాటక వేదికలుగా మారాయి. ఈ తీరానికి వస్తున్న సందర్శకులు కృష్ణానదిలో బోటుíÙకారు చేసేందుకు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక్కడి ప్రవేటు బోట్‌లతో నవలంక ఐలాండ్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవల నవలంక ఐలాండ్ ఆధునిక ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో నిత్యం కనిపించే సూర్యాస్తమయ దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఈ ప్రాంతానికి మరిన్ని హంగులు సమకూరిస్తే విశేష ఆదరణ లభిస్తుందని సందర్శకులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. శ్రీరామపాద క్షేత్రం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. దీంతో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది.
జలక్రీడల శిక్షణకు వాటర్‌స్పోర్ట్స్ అకాడమీ
ఇక్కడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యాన వాటర్‌స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుచేశారు. స్థానిక విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి జలక్రీడల్లో ఇక్కడ శిక్షణ పొందిన గాయత్రి జాతీయ స్థాయి రజిత పతకం సాధించిన విషయం విదితమే. రూ.1.10కోట్ల వ్యయ అంచనాతో పూర్తైన ఫుడ్‌కోర్టు భవన నిర్మాణం తుది దశలో ఉంది.
ఆకర్షిస్తున్న నాగాయలంక లైట్‌హౌస్
ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేసేది సాగర సంగమ ప్రాంతంలోని నాగాయలంక లైట్‌హౌస్. కృష్ణా దక్షిణ పాయ నాగాయలంక మీదుగా వెళ్లి మూడు పాయలుగా చీలి సాగర సంగమం చెందే సమీపంలో ఉన్న ఈ దీపస్తంభం విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి 20 కి.మీ నదీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుటుంబాలు, స్నేహితుల బృందాలు ప్రైవేట్ బోట్‌లలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో, లైట్‌హౌస్ పరిసరాల్లో విస్తరించిన వందలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవలసిందే. ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై చేపట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం పూర్తైతే నాగాయలంకకు లైట్‌హౌస్‌కు నడుమ ఉన్న ఈ ప్రాంతం మరింత గొప్ప పర్యాటక ప్రదేశంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
పర్యాటకానికి అన్ని వనరులూ ఉన్న నాగాయలంక తీరప్రాంతాన్ని దివిసీమ పర్యాటక కేంద్రంగా మరింత తీర్చిదిద్దాలి. అమరావతికి దక్షిణ నదీ ముఖద్వారం (రివర్‌ఫ్రంట్)గా ఆకర్షణగా ఉంది. శ్రీరామ పాదక్షేత్రం నుంచి లైట్‌హౌస్ వరకు పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఈ ప్రాంతం దివిసీమ పర్యాటకంలో కలికితరాయిగా ప్రాచుర్యం పొందుతుంది.
–తలశిల రఘుశేఖర్, ఔత్సాహిక కేజ్‌కల్చరిస్ట్, నాగాయలంక
Comments
Please login to add a commentAdd a comment