ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరుకు చెందిన శనగవరపు ఆంజనేయ శాస్త్రి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,010 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
బంగారు తాపడం పనులకు రూ.1.20 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు అనంతపురానికి చెందిన భక్తులు శనివారం రూ.1.20 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతపురానికి చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ కుటుంబం శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ప్రాంగణంలోని డోనర్ సెల్‌లో బంగారు తాపడం పనులకు రూ.1.20 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ ఈవో కె.ఎస్.రామరావు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
డోనర్ సెల్ ద్వారా రూ.30.27 లక్షల విరాళాలు
అమ్మవారి బంగారు తాపడం పనులకు డోనర్ సెల్ ద్వారా ఇప్పటివరకు రూ.30.27 లక్షల విరాళాలు అందాయని ఆలయ ఈవో కె.ఎస్. రామరావు తెలిపారు. ఏప్రిల్ 26న డోనర్ సెల్‌ను ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులకు రూ.30,27,434 విరాళాలను దాతలకు అందజేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment