
బకాయిల రోగం
వైద్య సేవకు
గత ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ వివరాలు
సాక్షి, మచిలీపట్నం: పేదల ప్రాణాలు కాపాడే అపర సంజీవని ఆరోగ్య శ్రీ. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకం నిర్వీర్యమైంది. నాడు ఎంతో ఘనంగా అమలైన ఈ పథకం ఇప్పుడు బకాయిల భారంతో మంచంపట్టింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీగా ఉన్న ఈ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన కూటమి ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదల చేయడం లేదు. బకాయిలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ముందుకు రావడం లేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్య సేవలు అందక, చేతిలో డబ్బు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అటకెక్కించిన ప్రభుత్వం, పేదల ప్రాణాలు కాపాడే ఆరోగ్య శ్రీని కూడా పట్టించుకోవడంలేదని పేదలు వాపోతున్నారు.
నాడు జీవం పోసిన వైఎస్సార్
ఆరోగ్య శ్రీ పథకానికి నాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. ఒక వైద్యుడిగా పేదల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతూ లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ వస్తోంది. మెడికల్ ఓపీ నుంచి గుండె ఆపరేషన్ల వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోంది.
వైఎస్సార్ సీపీ పాలనలో..
పేదల వైద్యం ఖర్చు రూ.వెయి దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల ఆరోగ్యం, వైద్యం తమ బాధ్యత అని నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెప్పేవారు. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తూ వచ్చారు. వైద్యం పొందిన రోగులకు భోజనాలు, కోలుకున్నాక తమ ఊరికి వెళ్లేందుకు చార్జీలు అందించడంతో పాటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు సకాలంలో నిధులు మంజూరు చేస్తూ వచ్చారు. కృష్ణా జిల్లాలో 35 వేల మందికి రూ.67.40 కోట్లతో వైద్య, శస్త్ర చికిత్సలు అందించారు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన ప్రభుత్వం
పేరు మార్చినా పథకం అమలును నిర్వీర్యం చేస్తున్న నిర్ణయాలు
నెట్‌వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించని వైనం
ఫలితంగా రూ.80 కోట్ల వరకు పేరుకుపోయిన బకాయిలు
చికిత్స అందించేందుకు ముందుకురాని ఆస్పత్రులు
ఉచిత వైద్యం అందక పేదలకు తీవ్ర ఇబ్బందులు
కూటమి పాలనలో బకాయిల భారం
సంవత్సరం వైద్యం పొందిన నిధులు
వారి సంఖ్య
2019–20 972 రూ.3.08లక్షలు
2020–21 468 రూ.1.25కోట్లు
2021–22 1,937 రూ.4.34కోట్లు
2022–23 3,608 రూ.8.19కోట్లు
2023–24 12,267 రూ.22.65 కోట్లు
2024–25 15,565 రూ.27.89కోట్లు
మొత్తం 34,817 రూ.67.40కోట్లు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు, బకాయిలు సకాలంలో చెల్లించకుండా వస్తోంది. ఫలి తంగా ఈ పథకం కింద రోగులకు వైద్యం అందించేందుకు పలు ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 19 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఏడు సీహెచ్‌సీలు, 49 పీహెచ్‌సీలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదయ్యాయి. వీటిలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలి. నెట్‌వర్క్ ఆస్పత్రుల వైద్య బకాయిలు సుమారు రూ.80 కోట్ల వరకు ఉన్నాయని సమాచారం.

బకాయిల రోగం
Comments
Please login to add a commentAdd a comment