
శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
పెనమలూరు: మండలంలోని యనమలకుదు రులో వేంచేసిన శ్రీ పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఉయ్యూరు ఆర్డీఓ హేలాషారోన్ ఆదేశించారు. యనమలకుదురులో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా 26న స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని ఆర్డీఓ తెలిపారు. ప్రభోత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపల్ కమిషనర్ భవానిప్రసాద్, సీఐ వెంకటరమణ, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ ప్రణవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఆలయాన్ని ఆర్డీఓ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించండి
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులకు రుచి కరమైన పౌష్టికాహారాన్ని అందించాలని, నిర్ల క్ష్యాన్ని ఉపేక్షించేది లేదని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి అరుణసారిక స్పష్టంచేశారు. స్థానిక వలందపాలెం బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని ఆమె సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార పదా ర్థాను అందించాలని, పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. తాను తరచూ తని ఖీలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సద్సులో న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ.. న్యాయసేవాధి కార సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరి గేలా కృషి చేస్తామన్నారు. న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య మాట్లాడుతూ.. పేదలకు తక్షణ న్యాయం అందేలా న్యాయవిజ్ఞాన సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, వసతి గృహ సంక్షేమా ధికారి షేక్ జహీరున్నీసాబేగం పాల్గొన్నారు.
పరిశోధనలతో మరిన్ని అవకాశాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో పరిశోధనలకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్, విశ్రాంత ఆచార్యుడు అప్పాజోస్యుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన సెమినార్‌లో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. పరిశోధనలు చేసే విద్యార్థులకు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అనంతరం శ్రీనివాసరావును ఆయా విభాగాల అధిపతులు సత్కరించారు. ఈ సెమినార్‌లో రెక్టార్ ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య ఎన్.ఉష, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సుజాత, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వీరబ్రహ్మచారి పాల్గొన్నారు.
చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చాలా ఘోరంగా మారాయని మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు. యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయిలు బాత్రూమ్‌కు వెళితే నిచ్చెనలు వేసుకొని ఫొటోలు తీస్తున్నారని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో చింతా మోహన్ సోమవారం విలేకరులతో మాట్లా డుతూ.. రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన చంద్రబాబు పైసా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు రూ.6 వేల కోట్లు స్వాహా చేశారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఒక్క తుళ్లూరు ప్రాంతంలోనే ఖర్చు చేయకుండా కర్నూలు నుంచి ఒంగోలు వరకు, శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment