● గ్రామ పంచాయతీ, ముడా అనుమతులు లేకుండా నిర్మాణాలు ● బం
సాక్షి, మచిలీపట్నం/బంటుమిల్లి: జిల్లాలో అక్రమ కట్టడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు పెద్ద మాల్స్, ఫంక్షన్ హాల్స్ సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తు న్నారు. మరోవైపు వెంచర్లు, లే అవుట్లకు కూడా ఎలాంటి అనుమతులు ఉండటం లేదు. ముఖ్యంగా పచ్చని పొలాలు, వరి పండే భూములను సైతం ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున చర్చ రావడంతో ఇటీవలే మేల్కొన్న అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకొని కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్లానింగ్, అనుమతులు తప్పనిసరి..
గృహ నిర్మాణాలతో పాటు వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తులు, మాల్స్, కల్యాణ మండపాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. 300 అడుగుల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకునే కట్టడాలకు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. ఆపై విస్తీర్ణంలో నిర్మించే వాటికి ఎంయూడీఏ అనుమతులు పొందాలి. ఆఫ్‌లైన్ విధానంలో కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొని, అనుమతులు పొందాలి.
ఎంయూడీయూ పరిధి ఇది..
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కేంద్రంగా 2016లో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పా టు చేశారు. ఇందులో మచిలీపట్నంతో పాటు పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కై కలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండలాల్లోని గ్రామాలు వస్తాయి. తగిన విస్తీర్ణం దాటి నిర్మించే కట్టడాలు, వెంచర్లు, మాల్స్, బహుళ అంతస్తుల నిర్మాణాలకు తప్పనిసరిగా ఎంయూడీఏ అనుమతులు పొందాలి.
నిబంధనలు గాలికి..
అనుమతులు లేకుంటే చర్యలు..
బహుళ అంతస్తుల నిర్మాణాలు, లే అవుట్లు, మాల్స్, వెంచర్లు, కల్యాణ మండపాల కట్టడాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. ముందుగా ఇంజినీరింగ్ ప్లానింగ్ మేరకు గ్రామ పంచాయతీ పరిధి దాటి ఉంటే.. ఎంయూడీఏలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ కార్యదర్శి, ఎంయూడీఏ అధికారులు ఫీల్డ్ విజిట్ తరువాత సూచించిన చలానా చెల్లిస్తే అనుమతులు ఇస్తాం. ఆఫ్ లైన్‌లో ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దు. అనుమతులు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటాం.
– కె. రవిశంకర్, కార్యదర్శి,
స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఎంయూడీఏ
నిబంధనలకు పాతర.. నిర్మాణాల జాతర
ఎంయూడీఏ కార్యాలయంలో 2024లో 380 దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 192 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ కలిగిన ఇంజినీర్ ప్లానింగ్ పొందాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, నిర్మాణాలు పూర్తిగా కట్టడానికి అయ్యే ఖర్చులో 14శాతం వరకు అనుమతుల ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఇది అమలు కావడం లేదు. కేవలం గుడ్లవల్లేరు, వడ్లమన్నాడులో నిర్మించే రెండు కట్టడాలను మాత్రమే అడ్డుకొని నిలిపివేశారు. బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, కల్యాణ మండపాలకు తప్పనిసరిగా సెట్‌బ్యాక్ (అగ్ని ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు వీలుగా స్థలం వదలాలి) ఉండాలి. కానీ ఇలాంటి నిబంధనలు పాటించకుండా వందల నిర్మాణాలు, వెంచర్లు వెలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment