చురుగ్గా శివాలయ నిర్మాణం
పెనుగంచిప్రోలు: స్థానిక మునేరు పక్కన స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో భక్తుల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మిస్తు న్నారు. మౌద్గల్య మహాముని తపస్సుతో ఏర్పడిన స్థానిక మునేరు పక్కన స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని 11వ శతాబ్దంలో సాగిపోతు రాజుగా పేరుపొందిన విజయాధిత్యుడు నిర్మించాడని, ఆ తరువాత 17వ శతాబ్దంలో అమరావతి కేంద్రంగా పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునః ప్రతిష్టించి నిత్య ధూపదీప నైవేద్యాల నిమిత్తం సుమారు 33 ఎకరాల భూమిని ఇచ్చారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ ఆలయం పూర్తిగా శిథిలమైంది. ధ్వజస్తంభం తుపాను గాలులకు విరిగి పోయింది. దీంతో ఆలయాన్ని పునః నిర్మించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. గతంలో ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయం కూడా గత ప్రాశస్త్యం కోల్పోకుండా కొండ రాళ్లతోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయం సగభాగం నిర్మాణ పూర్తి కావస్తోంది.
దేవదాయ శాఖ పర్యవేక్షణలో..
దేవదాయ శాఖ పర్యవేక్షణలో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు శంభులింగేశ్వరస్వామి ట్రస్ట్ ఏర్పాటు చేసి పాత ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. నూతన ఆలయ నిర్మాణానికి 2023, మార్చి 9న బలుసుపాడు గురుధామ్ క్షేత్రానికి చెందిన తాత్వికుడు గెంటేల వెంకటరమణ దంపతులు శంకుస్థాన చేశారు.
11వ శతాబ్దానికి చెందిన శంభులింగేశ్వరస్వామి ఆలయం
శిథిలావస్థకు చేరడంతో కొండరాళ్లతో పునర్నిర్మాణ పనులు
రూ.4 కోట్లతో నిర్మాణం
కోనేరు బావి నుంచి ఉద్భవించిన స్వామికి ప్రకృతి సిద్ధంగా అంతర్వాహినిగా మునేరు ప్రవహిస్తూ నిత్యా భిషేకం జరడం ఈ క్షేత్రం విశిష్టత. శివరాత్రి, కార్తికమాసం, మిగిలిన ఉత్సవాల సమయాల్లో శ్రీఅయ్యప్ప సేవాసమితి తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయ పునః నిర్మాణానికి పూర్తిగా దాతలు సహకరిస్తున్నారు. రూ.4 కోట్లకు పైగా అంచనాలతో శివాలయంతో పాటు వెనుక అయ్యప్పస్వామి ఆలయం కూడా నిర్మిస్తున్నాం. భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
– వాసిరెడ్డి బెనర్జీ, శంభులింగేశ్వరస్వామి ట్రస్ట్ బాధ్యుడు
చురుగ్గా శివాలయ నిర్మాణం
చురుగ్గా శివాలయ నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment