విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థినిపై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని జిల్లా కోర్టు సమీపం శిడింబి అగ్రహారంలో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ విద్యార్థినిని తరచూ బయటకు తీసుకెళ్లటంతో పాటు నిత్యం చాటింగ్ చేస్తున్నాడు. దీనిని గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు ఈ నెల 14వ తేదీన ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి వద్దకు వచ్చి నిలదీశారు. దీంతో వాగ్వాదం జరగ్గా ప్రిన్సిపాల్‌పై విద్యార్థిని తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ సమాచారం కళాశాల చైర్మన్‌కు తెలియడంతో ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆందోళన
విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కళాశాల ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌పై కాకినాడలో ఫిర్యాదు చేశామని యాజ మాన్యం చెప్పింది. ఘటనను కావాలనే నీరు కారుస్తున్నారని, మచిలీపట్నంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. అందుకు యాజమాన్యం నిరాకరించడంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కళాశాల ఫ్లెక్సీలను చింపి ఆందోళన చేపట్టారు. అనంతరం చైర్మన్ తమ కళాశాల ఉద్యోగుల ద్వారా ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డిపై చిలలకపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆందోళనను విరమించారు.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment