పది రోజుల్లో ‘పరీక్ష’
సాక్షి, మచిలీపట్నం: విద్యార్థి దశలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియెట్. ఉన్నత చదువులకు దీనిని ప్రామాణికంగా తీసుకుంటారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకమైన దశ ఇది. ఇంజినీర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్‌వేర్, ఫార్మసీ, అగ్రి కల్చర్, మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్... విభాగం ఏదైనా ఇంటర్ మీడియెట్ కీలకం. ఇంత కీలకమైన ఇంటర్ పరీక్షలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.
● మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు
ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు.
● మొదటి సంవత్సరం విద్యార్థులకు 1వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1, 4న ఇంగ్లిష్ పేపర్–1, 6న లెక్కలు–1ఏ / బోటని–1 / సివిక్స్ –1, 8న లెక్కలు–1బీ /జువాలజీ –1, హిస్టరీ –1, 11న ఫిజిక్స్ –1/ ఎకనామిక్స్ –1, 13న కెమిస్ట్రీ–1 / కామర్స్–1, సోషియాలజీ –1 / ఫైన్ ఆర్ట్, మ్యూజిక్–1, 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –1 /లాజిక్–1 / బ్రిడ్జ్ కోర్సు / మేథమేటిక్స్ (బైపీసీ విద్యార్థులకు)–1, 19న మోడ్రన్ లాంగ్వేజెస్–1 / జియోగ్రఫీ–1 ఉంటాయి.
● ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి 2వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2, 5న ఇంగ్లిష్ –2, 7న లెక్కలు–2ఏ / బోటని–2 / సివిక్స్ –2, 10న లెక్కలు–2బీ /జువాలజీ –2, హిస్టరీ –2, 12న ఫిజిక్స్ –2/ ఎకనామిక్స్ –2, 15న కెమిస్ట్రీ–2 / కామర్స్–2, సోషియాలజీ –2 / ఫైన్ ఆర్ట్, మ్యూజిక్–2, 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –2 /లాజిక్–2 / బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్ (బైపీసీ విద్యార్థులకు)–2, 20న మోడ్రన్ లాంగ్వేజెస్–2 / జియోగ్రఫీ–2 ఉంటాయి.
● జిల్లా సమాచారం
జిల్లాలో మొత్తం 169 జూనియర్ కాలేజీలు ఉండగా ప్రభుత్వ కళాశాలలు 8, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 114 ఉన్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 24,571 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,833 మంది ఉన్నారు. వీరిలో ఎంపీసీ 12,511 మంది, బైపీసీ 5,839 మంది విద్యార్థులు ఉండగా ప్రభుత్వ కళాశాలల ఎంపీసీ 136, బైపీసీ 117 మంది ఉన్నారు. ఒకేషనల్ కాలేజీలు 17 ఉండగా ప్రైవేటు 11, ప్రభుత్వ కాలేజీలు ఆరు ఉన్నాయి.
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు నేటితో ముగియనున్న ప్రాక్టికల్స్ కృష్ణాజిల్లాలో హాజరుకానున్న విద్యార్థులు 45 వేల మంది 63 పరీక్ష కేంద్రాలు.. 18 స్టోరేజ్ పాయింట్లు ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ 163 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన అధికారులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీ గా నిర్వహిస్తాం. ఇప్పటికే 63 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి, అక్కడ తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి కాలేజీలో టేబుల్స్, ఇతర సదుపాయాలు కల్పిస్తాం. విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ మొదలు పరీక్షలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహిస్తాం.
– పి.సాల్మన్ రాజు, ఆర్‌ఐఓ
నేటితో ముగియనున్న ప్రాక్టికల్స్
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు 18,350 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులు ఎంపీసీ 12,511, బైపీసీ 5,839 మంది ఉన్నారు. మార్చి 5వ తేదీ నుంచి జరిగే ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు 1,639 మంది హాజరు కానున్నారు. ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలల్లో 731 మంది ఉన్నారు.
ఏర్పాట్లు ఇలా...
ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 45,404 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం 63 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రశ్న, సమాధాన పత్రాలు భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో 18 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. 163 మంది సిబ్బందితో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు.
పది రోజుల్లో ‘పరీక్ష’
Comments
Please login to add a commentAdd a comment