స్వామివారి సన్నిధిలో క్యాట్ సభ్యులు
మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఏటీ) సభ్యులు లతా బీ పాట్నే, షాలిని మిశ్రా, జి.నవీన్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్దు సతీష్ శర్మ, వెంకటేశ్వరరావు, మణిదీప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
కూచిపూడిలో మాతృభాషా దినోత్సవం
కూచిపూడి(మొవ్వ): తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమ్మలాంటి కమ్మని మాతృభాషలో మాట్లాడి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేయాలని కళాపీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ ఆకాక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళా పీఠంలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళా పీఠం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ సీ్త్ర, పురుషుల హ్యాండ్‌బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లను ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ తెలిపారు. వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశామన్నారు. మహిళల జట్టుకు సత్య, షర్మిల, లక్ష్మి, శ్రావణి, లేపాక్షి, జాహ్నవి, అరుణనాగదుర్గ, ద్వారకేసరి, తనూజ, మానస, లోకేశ్వరి, భారతి, ధనుంజయశ్రీ , లీనాశ్రీ, భాగ్యలక్ష్మి, సుష్మాస్వరాజ్, పురుషుల జట్టుకు రితేష్, అభిష్, గౌతమ్, సుభాష్, డాని, సాయిగణేష్, భీమా, ధనుంజయ్, చరణ్, ధనుష్, దీపక్, వెంకటరత్నం, సీతయ్య, సంతోష్, చరణ్ ఎంపికై నట్లు తెలిపారు. కర్నూలులో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని వెల్లడించారు.
స్వామివారి సన్నిధిలో క్యాట్ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment