రీ సర్వే రికార్డులను పరిశీలించిన అడిషనల్ డైరెక్టర్
పెడన: మండలంలోని భా.హుస్సేన్‌పాలెంలో భూముల రీ సర్వే కార్యక్రమం పూర్తి కావడంతో ఆ రికార్డులను ల్యాండ్ అండ్ సర్వే శాఖ అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు పరిశీలించారు. ఆయన శుక్రవారం పెడన తహసీల్దారు కార్యాలయానికి విచ్చేయడంతో ల్యాండ్ అండ్ సర్వే జిల్లా అధికారి జోషిలా, మచిలీపట్నం ఆర్డీవో ఎం.స్వాతి, ఇన్‌చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన పుల్లపాడు పంచాయతీ పరిధిలోని భా.హుస్సేన్‌పాలెం గ్రామానికి సంబంఽధించి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములన్నీ కలిపి 229 ఎకరాలున్నాయని, వాటికి సంబంధించిన సర్వే నంబర్లు, రీ సర్వే నివేదికల రికార్డులను పరిశీలించారు. ఇన్‌చార్జి తహసీల్దారు అనిల్‌కుమార్, మండల సర్వేయర్ దాసు, సర్వే డీటీ సల్మా పూర్తి వివరాలను తెలియజేశారు. అనంతరం ఆయన మచిలీపట్నం మండలంలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారు.
రీసర్వే పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు
గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో భాగంగా శుక్రవారం మండలంలోని కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం గ్రామ సరిహద్దులు, భౌగోళిక సత్య నిర్థారణ నిర్వహించారు. ఈ ప్రక్రియను ఏపీ స్టేట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అకాడమీ జాయింట్ డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, తహసీల్దారు కె.వెంకటశివయ్య స్వయంగా తనిఖీ చేశారు. తహసీల్దారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 420 ఎకరాల్లో రీసర్వే ప్రక్రియ సంతృప్తికరంగా పూర్తయిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీభూమి వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చని తెలిపారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు స్థానిక తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment