‘‘తెలుగు తేజం’’ పాఠశాల పత్రిక ఆవిష్కరణ
పెడన: మండలంలోని చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం సిద్ధినేని సౌజన్య రూపొందించిన ‘తెలుగు తేజం’ పాఠశాల పత్రిక ఏడవ సంచిక, ఈ– బుక్‌ను పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ విద్యార్థులలో భాష పట్ల ఆసక్తి పెంచడానికి వారిలో పఠనాశక్తిని, రచనా శక్తిని పెంచటానికి ఇలాంటి పత్రికలు దోహదపడతాయన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కథలు, కవితలు, పద్యాలు వంటివి రాయడం, బొమ్మలు గీయటం, వారు చదివిన పుస్తకాల నుంచి మంచి అంశాలు సేకరించి పాఠశాల పత్రికకు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. పత్రికకు సంపాదకులుగా కలిదిండి రాంబాబు, ఉప సంపాదకులుగా పరిశే రాజేశ్వరరావు, తెలుగు ఉపాధ్యాయిని ఎం. పద్మజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment