గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న ఆప్కాస్(ఏపీ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్) ఉద్యోగులు తమ జీతాలు పెంచాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు నిలబడి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మేడూరి శేషుబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పశువైద్య కళాశాలను స్థాపించి పాతికేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ప్రభుత్వ నియామకం చేపట్టలేదన్నారు. ఈ కళాశాలను నమ్ముకొని అవుట్ సోర్సింగ్ విధానంలో కోస్టల్ ఆంధ్రా జోనల్‌లో 498 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని తొలగించి తిరిగి ప్రైవేట్ ఏజెన్సీల చేతులకు ఉద్యోగులను అప్పగించాలని చూడడం దుర్మార్గమన్నారు. యూనియన్ ఉపాధ్యక్షులు అంజిబాబు, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment