నిల్వ నీడ కరువు!
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పంట నిల్వకు అవకాశం లేక నష్టాల పాలు
రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేక నష్టపోతున్నారు. కోసిన పంట కోసినట్లు తక్కువ ధరకై నా అమ్ముకోవాల్సి రావడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. కృష్ణా జిల్లాలో వాణిజ్య పంటలకు కేరాఫ్ అయిన మోపిదేవి మండలంలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం కూరగాయలకు సరైన రేటు లేకపోవడంతో చాలా మంది రైతులు చేతికొచ్చిన పంటలను కూడా అలాగే వదిలేస్తున్నారు. ఏళ్లుగా మోపిదేవిలో రైతు బజార్ లేదా గిడ్డంగులు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు.
సాంకేతిక సాయంతో నేరాల అదుపు
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. పామర్రు సర్కిల్, గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
నేటితో తిరునాళ్ల ముగింపు
వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు బారులు తీరారు.
తిరుపతమ్మకు బంగారు నెక్లెస్
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి శుక్రవారం తెనాలికి చెందిన లంక శ్రీనివాసరావు, రత్నజ్యోతి దంపతులు 20గ్రా. బంగారు నెక్లెస్, 135గ్రా. వెండి గిన్నెను అందజేశారు.
–10లోu
నేడు, రేపు ఉచిత పుస్తకాల పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడ పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఉచిత పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి రావి శారదా తెలిపారు. శుక్రవారం పటమటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా తాము ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెండు రోజుల పాటు జరిగే ఈ పంపిణీ తొలుత 6 వేల పుస్తకాలతో ప్రారంభమైందని, ఈ ఏడాది పుస్తకాలను 30 విషయాలుగా విభాగించి సామాన్యుడు సైతం సులభంగా పుస్తకాలను ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. ఇందులో చిన్నపిల్ల ల పుస్తకాలు నుంచి వేదాంత గ్రంథాలు, అన్ని తరగతుల పాఠ్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంజినీరింగ్, మెడిసిన్ అరుదైన గ్రంథా లు, వైద్యశాస్త్రంలో వేదం వంటి రెండు సంపుటాల హరిసన్స్, మెడిసిన్, మరెన్నో ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఇంతియాజ్ ప్రారంభిస్తారని, పుస్తక ప్రియులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. సేకరించిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు స్టాండింగ్‌లో నుంచి తీసే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది. ప్లాట్‌ఫాంపై ఉన్న పిల్లరును ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు లేక పోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు, ఆర్టీసీ డ్రైవర్‌కు ఎటువంటి ప్రమాదం జరగక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదేవిధంగా జరిగిన ఘటనలో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి ఘటనే జరగడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మోపిదేవి: భూమిని నమ్ముకుని సాగులో నిమగ్నమైన రైతులు వాణిజ్య పంటలు వేసి మరోసారి నిండా మునిగిపోయారు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన భారీ వరదలకు లంక గ్రామాల్లో వేసిన పసుపు, కంద, జామ, అరటి వంటి తోటలు వేసి చేతికి వచ్చే సమయంలో కృష్ణమ్మ ఆగ్రహానికి గురై పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో కొంత సమయం తీసుకుని మరికొంత అప్పులు చేసి కృష్ణానది ఒడ్డున లంక గ్రామాల్లో పలు రకాల కూరగాయల పంటలు సాగు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాల్లో టమాటా, మిర్చి, క్యాబేజి సాగు చేపట్టారు. ప్రస్తుతం వీటి ధరలు దారుణంగా పడిపోవడంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావడంలేదని పంట పొలా ల్లోనే టమాటా, మిర్చి వదిలేస్తుండగా, క్యాబేజీ పంటను రోటోవేటర్ వేసి దున్నేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10,270 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి.
అధికారులు భరోసా ఇచ్చినా..
ఇటీవల మండలంలోని మోపిదేవివార్పు, బొబ్బర్లంక గ్రామాల్లో ధరలు లేవని రైతులు పండించిన క్యాబేజి పంటను దున్నేశారు. నాడు మార్కెట్‌యార్డు రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ పి. లావణ్య, మార్కెట్‌యార్డ్ ఏడీ నిత్యానందం ఘటనా స్థలానికి చేరుకుని పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఆ సమయంలో రైతులు మరోసారి మోపిదేవిలో మోడల్ రైతు బజారు హామీని గుర్తుచేశారు. వెంటనే రైతు బజారు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాథేయపడ్డారు. ప్రస్తుతం కోసూరువారిపాలెం, మెరకనపల్లి గ్రామాల్లో పండించిన టమాటా, మిర్చి పొలాల్లో వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
7
న్యూస్‌రీల్
రైతులు కుదేలు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం గిడ్డంగులు, లేదా రైతు బజార్ నిర్మించాలని ఏళ్లుగా వేడుకోలు మోపిదేవిలో స్థలం కేటాయించి ఆరేళ్లు అయినా ప్రయోజనం లేదు
రైతు బజార్ కలేనా?
ధరల ఒడుదొడుకులు ఉన్న సమయంలో పంటలు నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు లేదా కనీసం మోడల్ రైతు బజారు ఏర్పాటు చేయాలని రైతులు ఎంతోకాలంగా పోరాటం చేస్తుండగా.. 2018లో ఆర్‌ఎస్ నంబర్ 147లో మోపిదేవికాలనీ వద్ద 0.20 ఎకరాల స్థలం కేటాయించారు. సరిహద్దులు నిర్ణయించి సంబంధిత లెటర్‌ను అప్పటి తహసీల్దార్ విమలకుమారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్‌కు అప్పగించారు. దీనివల్ల రైతులు పండించిన పంటను వారి చేతుల మీదుగానే అప్పటికప్పుడు రైతు బజారులో నేరుగా విక్రయించుకోవచ్చని ఆనంద పడ్డారు. కానీ రైతులు అంటేనే గిట్టని నేటి పాలకులు, అధికారులు మరోసారి మోసగించారు.
నిల్వ నీడ కరువు!
నిల్వ నీడ కరువు!
నిల్వ నీడ కరువు!
నిల్వ నీడ కరువు!
నిల్వ నీడ కరువు!
నిల్వ నీడ కరువు!
నిల్వ నీడ కరువు!
Comments
Please login to add a commentAdd a comment