పెనుగంచిప్రోలు: పంచాయతీ రాజ్ శాఖ కమిషనరేట్ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో అత్యుత్తమ పారిశుద్ధ్య నిర్వహణలో పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఐవీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 85 శాతం మందికి పైగా ప్రజలు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను అభినందించారు.
గ్రామాభివృద్ధికి కృషి
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి మాట్లాడుతూ.. తాను సర్పంచ్‌గా ఎన్ని కై న నాటి నుంచి పెనుగంచిప్రోలు అభివృద్ధికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామంలోని రోడ్ల పక్కన మొక్కలు పెంచుతున్నామని, ప్రజలను చైతన్యవంతం చేస్తూ తడి,పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తున్నామని తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లాలోనే ఒక మోడల్‌గా నిర్వహిస్తూ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి అభినందనలు అందుకున్నామని వివరించారు. గ్రామంలో అందమైన పూలమొక్కలతో పాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టామని తెలిపారు. ఇటీవల అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందికి పెగుగంచి ప్రోలు చెత్త సంపద కేంద్రం వద్ద శిక్షణ తరగతులు ఏర్పాటుచేసి, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారని పేర్కొన్నారు. పెనుగంచిప్రోలును ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో రాజకీయ జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ ప్రజలు, పంచా యతీ సిబ్బంది, ఇతర శాఖల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.