
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన లంకపల్లి నరసింహారావు(64) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పొలం వెళ్లి వస్తుండగా గూడూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తలకు, కాలికి బలమైన గాయాలవ్వడంతో వెంటనే మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గూడూరు ఏఎస్‌ఐ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.