సామూహిక లైంగిక దాడి కేసును ఛేదించిన పోలీసులు
గన్నవరం: బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను ఆత్కూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సమక్షంలో నిందితులను అరెస్ట్ చూపించారు. అనంతరం ఎస్పీ కేసు వివరాలను మీడి యాకు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక తమ ఇంటి పక్కనే ఉండే కుటుంబంతో సన్నిహితంగా మెలిగేది. ఈ నెల తొమ్మిదిన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో జరిగిన అమ్మవారి జాతరకు సదరు కుటుంబంతో పాటు బాలిక కూడా వచ్చింది. ఈ నెల 13వ తేదీ రాత్రి ఆ బాలిక కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఓ ఆటో డ్రైవర్ ద్వారా బాలిక మాచవరం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు ఆమె తల్లిదండ్రుల సమక్షంలో బాలికను తీసుకొచ్చి పెద్ద ఆవుటపల్లిలోని బంధువుల ఇంటికి పంపించారు. అనంతరం కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఉమెన్ ఎస్‌ఐ నేతృత్వంలో విచారణ జరపగా సామూహిక లైంగికదాడి విషయం బయటపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను ఆమె స్వగ్రామంలో దింపుతామని వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన కొంత మంది యువకులు నమ్మబలికారు. అనంతరం ఆ బాలికను వేర్వేరు ప్రాంతాలకు మార్చుతూ యువకులు ఆమైపె సామూహిక లైంగిక దాడికి పాల్పొడ్డారని విచారణలో తేలింది. ఆ బాలిక నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు రేప్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వీరపనేనిగూడెంనకు చెందిన బాణవతు లక్ష్మణజితేంద్రకుమార్‌నాయక్, పగడాల హర్షవర్ధన్‌ను అరెస్టు చేశారు. మరో ఆరుగురు యువకులను పట్టుకోవాల్సి ఉందని, వారిలో మైనర్లు ఉన్నారని పోలీ సులు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచాక్యంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, సీఐ కె.వి.వి.ఎన్.సత్యనారాయణ, ఆత్కూరు ఎస్‌ఐ చావా సురేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, గన్నవరం ఎస్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.