లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా విజయవాడకు చెందిన డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కేశవరావు బాబు మధుమేహం, రక్తపోటుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు తెలుగులో రచనలు చేసి, వైద్య పరిశోధనల్లోనూ తనదైన ముద్ర వేశారు. నగరంలో ఓడీఏ ప్రాజెక్టు వైద్యాధికారిగా, పట్టణ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా, వీఎంసీ స్కూల్ హెల్త్ ఆఫీసర్‌గా సేవలు అందించారు. ఐఎంఏ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులవడంతో పలువురు అభినందనలు తెలిపారు.
ఖో–ఖో టోర్నీలో సత్తా
గుడివాడ టౌన్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖో–ఖో టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషుల టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు టీమ్ కోచ్ అండ్ మేనేజర్ మడకా ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలోని వినయ్ మార్గ్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో గుడివాడ పట్టణానికి చెందిన క్రీడాకారుడు, తన శిష్యుడు ధనాల రాజ్‌కుమార్ పాల్గొని అత్యంత ప్రతిభను ప్రదర్శించారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగి అయిన రాజ్‌కుమార్ ప్రస్తుతం డెప్యూటేషన్‌పై మునిసిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ఖో–ఖో సంఘం కార్యదర్శి ఎం. సీతారామిరెడ్డి, కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం. సత్యప్రసాద్, గుడివాడ, నూజివీడు మునిసిపల్ కమిషనర్‌లు బి. శ్రీనివాసరావు, ఆర్. వెంకట రామిరెడ్డి అభినందించారు.
వీఎంసీ ఆర్‌ఎఫ్‌వోకు
ఉత్తమ సేవా పతకం
పటమట(విజయవాడతూర్పు): వీఎంసీలోని అగ్నిమాపక విభాగంలోని రీజనల్ ఫైర్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావుకు ఉత్తమ సేవా పతకం లభించింది. తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా 32 ఏళ్లపాటు విశిష్ట సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ ఫైర్ సర్వీస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కేశవరావు బాబు
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కేశవరావు బాబు