
నవలంక దీవి సందర్శించిన జిల్లా అధికారులు
నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ ఎదుట ఉన్న నవలంక మినీ ఐలెండ్‌ను బుధవారం ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రీజనల్ డైరక్టర్ వై.వి.ప్రసన్నలక్ష్మి, కృష్ణాజిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి సందర్శించారు. నాగాయలంక తహసీల్దార్ ఎం.హరనాఽథ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీవి మ్యాప్‌ను పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన సర్వే మేరకు 16.75 ఎకరాలు దీవిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. దీవిలో మిగతా పరిధిని కూడా సర్వే చేయాలని భావిస్తున్నారు. ప్రాథమిక పరిశీలనగా నవలంకలో ఏ విధంగా పర్యాటకాభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మండలంలోని ఎదురుమొండి దీవిలో పర్యటించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా డీఆర్వో చంద్రశేఖరరావు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సమీపంలో గుల్లలమోద వద్ద డీఆర్‌డీఓ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం, ప్రాజెక్ట్ సైట్‌లను పరిశీలించారు. ఈనెల ఏపీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఈ క్షిపణి ప్రయోగ కేంద్రానికి వర్‌ుచ్యవల్‌గా శంకుస్థాపన చేయునున్నారన్న ప్రచారం నేపథ్యంలో డీఆర్వో ఈ ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పర్యాటక అభివృద్ధి ప్రణాళిక అంశాలు పరిశీలన గుల్లలమోద డీఆర్‌డీఓ కేంద్రం స్థల సందర్శన