పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రజలు
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో నీలిచిత్రాలు ప్రసారం కావడంతో ప్రజలు అవాక్కయ్యారు. నందికొట్కూరు పట్టణంలోని ఫిరోజ్ డిజిటల్ నెట్‌వర్క్ నుంచి పగిడ్యాల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు టౌన్, మండలాల్లోని ప్రజలు డిష్ కనెక్షన్ పొందారు. కాగా మంగళవారం మధ్యాహ్నం ఇళ్లల్లో టీవీ చూస్తుండగా అకస్మాత్తుగా నీలిచిత్రాలు ప్రసారమైన విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యక్తులు వెంటనే కేబుల్ నెట్‌వర్క్ యజమాని షబ్బీర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నిలిపివేశారు. నీలిచిత్రాలు ప్రసారం కావడంతో ఫిరోజ్ డిజిటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కిరణ్‌రెడ్డితో పాటు మరి కొందరు కేబుల్ నెట్‌వర్క్ యాజమాని షబ్బీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment