
ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం
కర్నూలు (టౌన్): ‘నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పాలకవర్గ సభ్యులందరూ ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం’ అని వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్‌లో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షు రాలు సిట్రా సత్యనారాయణమ్మ కలిసి కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుదీర్ఘంగా పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొ రేటర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు, నగరాభివృద్ధి, అధికార పార్టీ కుట్రలు, కుతాంత్రాల ను దీటుగా ఎదుర్కోవడంపై చర్చించనున్నట్లు తెలి పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూ లు నగరంలో నాలుగేళ్లుగా రూ. 720 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నగరంలో అభివృద్ధి పనులు అటకెక్కాయన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కింద ఆయా వార్డుల్లో రూ.34 కోట్లతో చేపట్టాల్సిన 160 పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇంకా ఏడాది పాటు వైఎస్సార్‌సీపీ పాలకవర్గానికి గడువు ఉందని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. సమావేశంలో నగరపాలక వర్గ సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
18న మాజీ సీఎం జగన్‌తో
పాలక వర్గ సభ్యుల భేటీ
వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లాల
అధ్యక్షులు ఎస్వీ, కాటసాని

ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం
Comments
Please login to add a commentAdd a comment