28 నుంచి రోజా దర్గా ఉరుసు
కర్నూలు (టౌన్): తుంగభద్ర నది తీరంలో వెలసిన రోజా దర్గా ఉరుసు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతుందని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా ఖాద్రీ తెలిపారు. సోమవారం ఆ దర్గాలో ఉరుసుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నెలవంక రోజు గంథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 28 న గంథోత్సవం, మార్చి 1వ తేదీన ఉరుసు, 2 వ తేదీ జియారత్ ఫాతెహాలు ఉంటాయన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా బళ్లారి, మహబూబ్ నగర్, అనంతపురం బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గాలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉరుసు రోజు రాత్రి ఖవ్వాలి ఉంటుందన్నారు. పోస్టర్ల ఆవిష్కరణలో రోజా దర్గా జాన్ నసీన్ ఇషాఖియా సయ్యద్ జావీద్ పాషా ఖాద్రీ, సయ్యద్ నూరుల్లా హస్సైనీ సాహెబ్, సయ్యద్ మాసుంపీర్ సాహెబ్, సయ్యద్ గౌస్ ఖాద్రీ, ఎస్.కరీమ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment