‘దేవ’ చిత్రం.. అపు‘రూపం’
కర్నూలు(అగ్రికల్చర్): దేవుళ్ల చిత్రాలను రూపొందించడం.. జాతీయ నాయకుల రూపాన్ని తన చిత్రాల్లో చూపించడం.. ప్రకృతి రమణీయతను అపురూపంగా చిత్రీకరించడం... పత్తికొండ పట్టణానికి చెందిన దూపం దేవదాసు ప్రత్యేకత. చిత్రలేఖనంపై ఎనిమిదో తరగతి నుంచే మక్కువ పెంచుకొని డిగ్రీలో కూడా లలిత కళలకు సంబంధించిన కోర్సును అభ్యసిస్తున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, బహుమతులు పొందుతూ... అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో బీఎఫ్‌ఏ(బ్యాచలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తింపు పొందాలనేది తన లక్ష్యమని విద్యార్ధి దూపం దేవదాసు తెలిపారు. బీఎఫ్‌ఏ పూర్తయిన తర్వాత పీజీలో ఇందుకు సంబంధించిన కోర్సునే తీసుకొని మరింత నైపుణ్యాలను పెంచుకుంటానని చెప్పారు.
ఇదీ ప్రత్యేకత..
● ఎడమ చేతితో రాయడం, చిత్రాలు గీయడం దేవదాసు ప్రత్యేకత.
● కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో చిత్రాన్ని గీస్తాడు.
● యోగి వేమన యూనివర్సిటీలో బీఎఫ్‌ఏ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీల యూత్ ఫెస్టివల్‌లో ఈ యువకుడికి రజత పతకం లభించింది.
● భారతదేశంలో ప్రముఖ వేడుకను తన చిత్రంలో ఆవిష్కరించినందుకు జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ లభించింది.
● తిరుపతి విజ్ఞాన కేంద్రం, తిరుపతి శ్రీ కళాక్షేత్ర సంయుక్తంగా నిర్వహించిన వేమన పద్య భావన చిత్ర కళా పోటీల్లో మూడో కేటగిరిలో మొదటి బహుమతి అందుకున్నారు.
● జిల్లా స్థాయిలో ఒకసారి మొదటి, మరోసారి రెండో బహుమతి అందుకున్నారు.
చిత్ర లేఖనంలో రాణిస్తున్న
పత్తికొండ విద్యార్ధి
జాతీయ స్థాయిలో పతకాలు,
ప్రశంసాపత్రాలు
‘దేవ’ చిత్రం.. అపు‘రూపం’
‘దేవ’ చిత్రం.. అపు‘రూపం’
‘దేవ’ చిత్రం.. అపు‘రూపం’
Comments
Please login to add a commentAdd a comment