
కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత
నందవరం: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసినట్లు వెటర్నరీ డాక్టర్ వరలక్ష్మి, ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగలదిన్నె గ్రామంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో శనివారం వాహనా ల తనిఖీ చేపట్టారు. ఎమ్మిగనూరు నుంచి ఎలాంటి అనుమతులు లేని 30 వేల గుడ్లతో వచ్చి బొలెరో వాహనాన్ని తనిఖీ చేసి వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేయాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతి పత్రాలు చూపించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేని గుడ్లు, కోళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్ వెల్లడించారు. తనిఖీలో వెటర్నరీ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment