పేరుకుపోతున్న గుడ్ల నిల్వలు
బర్డ్‌ఫ్లూ వెలుగు చూసిన తర్వాత గుడ్ల వినియోగం భారీగా పడిపోయింది. జనవరి నెల చివరి వరకు 100 గుడ్ల ధర రూ.500 పైబడి ఉంది. బర్డ్‌ఫ్లూ ప్రచారం మొదలైన తర్వాత గుడ్లకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో గుడ్ల ఫారాలు ఉన్నాయి. ఇక్కడి ఫారంలో రెండు లక్షల కోళ్లు ఉన్నాయి. రోజుకు 40 వేల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గుడ్లను అడిగే వారు లేరు. బాగా ఉడికించి తినే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు భయపడుతుండటంతో డిమాండ్ పడిపోయింది. నేడు 100 గుడ్ల ధర రైతు దగ్గర రూ.370కి పడిపోయింది. జిల్లా నుంచి గుడ్లు బయటికి వెళ్లకుండా చెక్‌పోస్టులు పెట్టడంతో నిల్వలు పేరుకపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment