కలెక్టర్‌కు ఫిర్యాదు
ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ నాలుగు నెలల క్రితం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నేతృత్వంలో పేదలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును కలెక్టర్ పరిశీలన నిమిత్తం ఓర్వకల్లు తహసీల్దార్‌కు సిఫారసు చేశారు. దీంతో కథ కంచికి చేరినట్లు..అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు కదలడంలేదు. ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో ఎవరినీ అడిగినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. దీనిపై తాము ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో బాధితులు అధికారుల చుట్టూ తిరిగి అలసి పోయారు. వారికి న్యాయం మాత్రం దొరకడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment