మహానంది: నంద్యాల నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా 13 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. గురువారం గిద్దలూరుకు చెందిన కిషోర్, మౌనిక కుటుంబ సభ్యులు అహోబిలం ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా గాజులపల్లె సమీపంలో బ్యాగు గల్లంతైనట్లు గుర్తించారు. అందులో 13 తులాల బంగారు నగలు ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డికి సమాచారం అందించగా మహానంది పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ జరగలేదని చెప్పారు. గిద్దలూరు వెళ్లిన తర్వాత బాధితులు గుర్తించినట్లు తమకు సమాచారం అందిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment