రేపు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
కోవెలకుంట్ల: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో జిల్లా టీ–20 క్రికెట్ జట్టును శనివారం ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు అద్వైత్, ఉసేన్‌వలి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. టీ–20 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–16, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడాకారులు ఇతర వివరాలకు 8464942920, 9701515415 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
ఏపీజీబీ ప్రధాన
కార్యాలయాన్ని తరలించొద్దు
● రాయలసీమ అభివృద్ధి వేదిక
నాయకుల డిమాండ్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని, అమరావతికి తరలించొద్దని రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఏపీజీబీ రీజినల్ కార్యాలయం దగ్గర వాల్ పోస్టర్లను ఆ వేదిక నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌శర్మ, నాగరాజు, భాస్కరరెడ్డి, సునయ్‌కుమార్, జంద్యాల రఘుబాబు, అంజిబాబు మాట్లాడుతూ.. కడపలో ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అది అక్కడే ఉంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కూలీల కష్టం దగ్ధం
ఆస్పరి: మండలంలోని బిల్లేకల్లు గ్రామంలో ఉచ్చీరప్ప, అతని భార్య కూలి పనిచేసి సంపాదించినంతా అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. కూడపెట్టుకున్న డబ్బు, బంగారం, మోటార్‌సైకిల్ అగ్నికి ఆహుతయ్యాయి. ఆ కుటుంబ పరిస్థితి చూసి గ్రామస్తులు అయ్యో పాపం అంటున్నారు. గత 15 రోజుల క్రితం బిల్లేకల్లు గ్రామంలోని గుడిసెకు తాళం వేసి ఉచ్చీరప్ప, అతని భార్య, కుమార్తె గుంటూరు దగ్గర మిర్చి కోతకు వలస వెళ్లారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె నుంచి గురువారం మంటలు చెలరేగడంతో సమీపంలోని వారు గుర్తించారు. మంటల్లో మూడు తులాల బంగారం, రూ.50వేలు నగదు, ఒక మోటార్ సైకిల్, దుస్తులు, గింజలు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి మంటలను అర్పివేశారు. నష్టపోయిన బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలి గ్రామస్తులు కోరుతున్నారు.
రేపు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment