సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
కర్నూలు: సారా తయారీ, రవాణా, విక్రయాలు మానుకోకపోతే పీడీ చట్టంతో జైలుకు పంపుతామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు హెచ్చరించారు. నవోదయం 2.0లో భాగంగా కర్నూలులోని బంగారుపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ నీలిషికారీలు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. సారా తయారీ మానుకోకపోతే అలాంటి వారి జాబితాను తయారు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, సీఐలు జయరాం నాయుడు, సుభాషిణి, చంద్రహాస్, ఎస్‌ఐ రెహనా బేగం పాల్గొన్నారు.
వృద్ధుడి అనుమానాస్పద మృతి
కోసిగి: స్థానిక రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ట్రాక్‌కు కొంత దూరంలో ముళ్ల పొదల మధ్య పడి ఉన్నాడు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. గుండెపోటుకు గురై మృతి చెందాడా..ఇతర కారాణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పోలీసులు తేల్చాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానికులు గమనించి కోసిగి పోలీసులకు సమాచారం అందించగా స్థలానికి చేరుకున్నారు. స్థలం రైల్వే లైన్ పరిధిలో ఉండడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేసి మృతికి కారాణాలు తేల్చాల్సి ఉంది.
సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
Comments
Please login to add a commentAdd a comment