అన్నదమ్ముల ఆస్తి పంచాయితీ
డోన్: కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలను సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో ఒకరికే వత్తాసు పలకడంతో వివాదం మరింత ముదిరింది. చివరకు ఓ వ్యక్తి అదృశ్యానికి కారణమైంది. టీడీపీ నాయకులు, పోలీసులు వేధిస్తుండటంతో తన భర్త నబీ రసూల్ అదృశ్యమయ్యాడని యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన షాహీన్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. తన బావ మిన్నల్ల హుసేన్ టీడీపీ నేత కావడంతో పోలీసుల అండతో తరచూ తన భర్త నబీరసూల్‌ను వేధిస్తున్నారన్నారు. రెండు రోజులుగా తన భర్త కనిపించడం లేదని, అతనికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని టీడీపీ నాయకులు, పోలీసులను ఆమె ప్రశ్నించారు. కుటుంబ ఆస్తి వివాదంలో పోలీసులు కలుగజేసుకుని తన భర్తను వేధించడం ఎంత వరకు న్యాయమన్నారు. ఆస్తి కోసం తన భర్తను సొంత బావనే కిడ్నాప్ చేశారేమోనని అనుమానం కలుగుతుందని ఆమె ఆరోపించారు. వెంటనే తన భర్తను క్షేమంగా ఇంటికి చేర్చే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరారు.
అన్న టీడీపీ నేత కావడంతో
పోలీసులు అతనికే వత్తాసు
పోలీసుల వేధింపులతో రెండు
రోజులుగా కనిపించని తమ్ముడు
ఆందోళనలో కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment