కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
కర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 23వ తేదీన జిల్లాలో 30 కేంద్రాల్లో నిర్వహించనున్నారని డీఆర్వో సి.వెంకట నారా యణమ్మ తెలిపారు. జిల్లాలో మొత్తం 9,993 మంది పరీక్షలు రాయనున్నారని, వారి సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే 08518–277305 నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలపై అధికారులతో గురువారం ఆమె సమీక్షించారు. పరీక్షలు రాసే వారు సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూ చించారు. నిర్దేశిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోరని పేర్కొన్నారు. టౌన్ డీఎస్పీ బాబుప్రసా దు, ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రటరీ వి.బాబురావు, సెక్షన్ ఆఫీసర్లు బ్రహ్మేశ్వరరావు, సుధాకర్‌బాబు, ఏఎస్‌ఓలు కేఎస్‌ఎస్ అనిల్‌కుమార్, టి.ఆంజనేయులు, యోగేష్ పాల్గొన్నారు.
మిర్చి ధర పతనం
● క్వింటా రూ.9,500 మాత్రమే
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి క్వింటా ధర రూ.20 వేలు లభిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది. అయితే సగం ధర కూడా రైతుకు దక్కకడం లేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 804 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు సగటున రూ.9,500 ధర మాత్రమే లభించింది. ఈ ఏడాది జిల్లాలో 95,477 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడులు 50 శాతం వరకు తగ్గిపోయాయి. గత నాలుగైదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ధరలు కూడా పడిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రతి రోజు ప్రత్యేక తరగతులు
ఆలూరు రూరల్: బీసీ హాస్టళ్లలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆలూరులోని బీసీ బాలికల, బాలుర హాస్టళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో, ఇంటర్‌లో హాస్టల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని వార్డెన్లను ఆదేశించారు. సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి కుళ్లాయప్ప, వార్డెన్లు షాహినూర్, సంపత్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల
ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ పరిశీలించారు. సర్వదర్శనం, శీఘ్ర, అతి శీఘ్రదర్శన క్యూలైన్లు, పాగాలంకరణ, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్యూలైన్ల నిర్వహణ పూర్తి ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం క్యూలైన్ల నిర్వహణను పరిశీలిస్తుండాలన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. క్యూకాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, దేవస్థానం ఎం.శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు
మహానంది: మహానందీశ్వరుడికి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు వచ్చినట్లు ఆల య ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని అభిషేకం మండపంలో గురువారం శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయక నంది ఆలయాల హుండీలతో పాటు అన్నదాత విభాగం, గోసంరక్షణ విభాగం హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల హుండీల ద్వారా రూ.58,56,681 రాగా అన్నప్రసాదం ద్వారా రూ.99,110, గోసంరక్షణ విభాగం ద్వారా రూ.31,317 వచ్చిందన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ మధు, సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
Comments
Please login to add a commentAdd a comment