● ఎస్‌పీఎఫ్ డీజీపీ త్రివిక్రమ్ వర్మ
శ్రీశైలం: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రెడ్‌క్రాస్ సొసైటీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్‌పీఎఫ్ డీజీపీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. శనివారం ఆయన కై లాస ద్వారంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. మెడికల్ సొసైటీ శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగశేషయ్యతో మాట్లాడి వైద్య శిబిరంలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబులెన్స్‌లో ఉన్న ఈసీజీ ఆక్సి మీటర్, కాన్సన్‌ట్రేటర్, బీపీ చెకింగ్ మిషన్, తదితర వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరంలో వైద్యులు డాక్టర్ కె.ప్రసాద్, విజయలక్ష్మి, బసవరాజు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment