
పెళ్లిపెద్దకు ఆహ్వానం
మహానంది/నంద్యాల(వ్యవసాయం): మహాశివరా త్రి సందర్భంగా మహానందిలో జరిగే కల్యాణోత్సవానికి పెళ్లిపెద్దగా వ్యవహరించే నంద్యాల బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించేందుకు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామి శనివారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు. మహానంది ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నంద్యాలకు ఉత్సవంగా బయలుదేరారు. నంద్యాల చెరువు కట్ట వద్ద వేదపండితులు స్వాగతం పలికారు. ఆదివారం పట్టణంలో గ్రామోత్స వం నిర్వహించి
బ్రహ్మనందీశ్వరస్వామి, పార్వతీదేవిని
మహానందికి తీసుకెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment