
నీరు నిలిచి.. పంట ఎండి
హరివరం చానల్ పరిధిలో ఎండిన వరి పైరు
చేతికందాల్సిన వరి పైరుకు నీరందక ఎండిపోతోంది. పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు కన్నీళ్లు కష్టాలు తప్పడం లేదు. సాగునీటి విడుదలపై ప్రణాళికపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. నీరందక కేసీ ఆయకట్టుకు ముప్పు ఏర్పడింది. దొర్నిపాడు మండంలో కేసీ కింద సుమారు 550 ఎకరాలకు పైగా రైతులు వరి సాగుచేశారు. కానీ మంచి అదునులో నీరు కాక పోవడంతో పంటంతా ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.30 వేలకు వెచ్చించిన పెట్టుబడులు చేతికందని పరిస్థితి ఏర్పడింది. – దొర్నిపాడు