
● రూ. 2 లక్షలు, 8 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
ఎమ్మిగనూరులో పట్టపగలు చోరీ
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని సాయినగర్‌లో మంగళవారం పట్టపగలు ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటుంన్న మల్లారి అర్జున్‌రావు సోమప్ప సర్కిల్ ప్రాంతంలో హార్ట్‌వేర్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. భార్య, పిల్లలు ఊరికెళ్లటంతో ఇంటికి తాళం వేసి అతను షాప్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇల్లును లూటీ చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువా తీసి ఉండటం, వస్తువులు చెల్లాచెదారుగా పడి ఉండటంతో పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రూ. 2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్ణణ సీఐ వి. శ్రీనివాసులు రాత్రి తెలిపారు.
పాలీసెట్ ఎంరట్రెన్స్‌కు ఉచిత శిక్షణ
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు రాసి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారికి బుధవారం నుంచి పాలీసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జి.పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వీ.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరై, పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94924 03015ను సంప్రదించాలని సూచించారు.