సాక్షిప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ను తమ వ్యాపారానికి కేంద్రంగా మార్చుకున్నారు గంజాయి విక్రయదారులు. కొత్త పంథాలో, సరికొత్త ఎత్తుగడలతో గంజాయిని తరలిస్తూ, విక్రయిస్తున్నారు. పోలీ సులు ఎప్పటికప్పుడు తనిఖీలతో చెక్ పెడుతున్నప్పటికీ.. మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్నట్లుగా ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈజీ మనీ కోసం కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. విశాఖపట్నం, ఒ డిశా నుంచి వరంగల్ మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న ముఠా..నగరంలో నూ ఏజెంట్లను ఏర్పరుచుకుని గంజాయి విక్రయిస్తోంది.కాగా..సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్)ను మంగళవారం ప్రారంభించారు.ఈనేపథ్యంలో వరంగల్‌ను డ్రగ్స్‌ఫ్రీ కేంద్రంగా మార్చేందుకు మరింత సీరియస్‌గా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
స్కూల్ స్థాయి నుంచే..
యువతతో పాటు కొందరు స్కూల్ స్థాయి నుంచే గంజాయి వినియోగిస్తున్నారు. రాత్రి సమయంలో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్‌ల పరిసర ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ బస్‌స్టేషన్ ఆవరణలు, వరంగల్‌లోని ఉర్సు గుట్ట, చిన్నవడ్డేపల్లి చెరువు, రంగశాయిపేట బెస్తం చెరువు, ఖిలావరంగల్ గుండు చెరువు, రాతికోట, ఎనుమాముల మార్కెట్ శివారు, కాకతీయ కెనాల్ ప్రాంతాలు, హనుమకొండలోని బంధం చెరువు, న్యూశాయంపేట రైల్వే ట్రాక్, ఔటర్ రింగ్ రోడ్డు, పలివేల్పుల, వడ్డేపల్లి చెరువు కట్ట, హాస్టళ్లు, అద్దె రూములను అడ్డాగా చే సుకొని విద్యార్థులు బృందాలుగా ఏ ర్పడి గంజాయి తాగుతున్నారు. ఇటీవల అమ్మాయిలు సైతం గంజాయికి అలవాటు పడుతున్నట్లు తెలిసింది.
కట్టడి చేసేందుకు
డబ్ల్యూఎన్‌పీఎస్..
డ్రగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్)ను ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌తో పాటు మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇక్కడే హెడ్‌క్వార్టర్‌గా డీఎస్‌పీ నేతృత్వంలో పోలీసు బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.88 కోట్ల విలువైన 35,319 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 389 కేసులు నమోదు చేసినట్లు అధికారులు డబ్ల్యూఎన్‌పీఎస్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు.
రవాణా మార్గాలివే..
గంజాయిని ప్రధానంగా ఏడు మార్గాల ద్వారా వయా వరంగల్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్రకొండ, సీలేరు, డోర్నకల్, మోతుగూడెం, చింతూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం నుంచి వరంగల్ ఒక మార్గం, చిత్రకొండ, సీలేరు, డోర్నకల్, మోతుగూడెం, లక్నవరం ఎక్స్ రోడ్, రాజమండ్రి మరోమార్గం. కలిమెల, కుంట (ఛత్తీస్‌గఢ్), చెట్టి (చింతూరు), భద్రాచలం మరోమార్గం. భద్రాచలం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, వరంగల్, హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయి తరలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదో రూటు రాజమండ్రి, అశ్వారావుపేట, కల్లూరు, తల్లాడ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ కాగా.. పాడేరు, జి మాడ్గుల, చోడవరం, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్‌కు గంజాయి తరలుతోంది. అలాగే చింతపల్లి, లంబసింగి, నర్సిపట్నం, కోటనందూరు, తుని, జగ్గంపేట, రామచంద్రాపురం, చింతూరు, గుండాల, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, జనగామ, హైదరాబాద్‌కు వెళ్తుండగా..ఇదేదారిలో జనగామ నుంచి వరంగల్‌కు చేరుతుంది. అరకు, ఎస్.కోట, దేవరపల్లి, పెందుర్తి, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ నుంచి వరంగల్, హైదరాబాద్‌కు.. వరంగల్ నుంచి మహారాష్ట్రకు వివిధ మార్గాల ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పట్టుబడిన గంజాయి, కేసులు, విలువ
యూనిట్ కేసుల డిస్‌పోస్డ్ డ్రగ్ విలువ
సంఖ్య (కిలోల్లో) (రూ.కోట్లలో)
వరంగల్ 21 1,245.439 3.07
మహబూబాబాద్ 24 515 1.29
జేఎస్ భూపాలపల్లి 25 636.39 1.59
ఖమ్మం 48 853.577 1.96
భద్రాద్రి కొత్తగూడెం 271 32,069.181 80.17
మొత్తం 389 35319.587 88.08
Comments
Please login to add a commentAdd a comment