భావితరాల కోసమే ‘చిందోళ్ల చరిత్ర’
● పద్మశ్రీ గడ్డం సమ్మయ్య
దేవరుప్పుల : భావితరాల కోసమే ‘చిందోళ్ల చరిత్ర’ గ్రంఽథం రూపొందించారని ప్రముఖ చిందు యక్షగానకళాకారుడు, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో డాక్టర్ గడ్డం మోహన్ రావు రచించిన ‘ చిందోళ్ల చరిత్ర – సాహిత్యం, సంస్కృతి’ గ్రంథాన్ని కేంద్ర సాంస్కృతిక, బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించినట్లు సమ్మయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు లంకల సందీప్ రెడ్డి, గడ్డం హిమగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment