తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి
నెహ్రూసెంటర్: వేసవికాలంలో తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవా రం హైదరాబాద్ నుంచి సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మా ట్లాడుతూ.. వేసవికాలం తాగునీటి ఇబ్బందులు లే కుండా చూడాలన్నారు. ప్రజాపాలనలో వచ్చిన ద రఖాస్తుల ఆధారంగా అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వీసీ అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ... జిల్లాలో తాగు, సాగునీరు అదించాలని, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నరేష్, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, డీఏఓ విజయనిర్మల, డీపీఓ హరిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment